World Cup: భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. తొలిసారి మనఎలా దేశం సొంతంగా ఈ ప్రతిష్టాత్మక మెగా టోర్నీకి ఆతిథ్యమివ్వనుండటం విశేషం. కప్‌ను ముద్దాడాలని ప్రతి జట్టు ఎంతగానో ఉవ్విళ్లూరుతోంది. అందుకే ఈ మెగా టోర్నీ కోసం అన్ని జట్లు పటిష్ఠ బ్యాటర్లు, బౌలర్లతో పాటు అత్యుత్తమ ఫీల్డర్లతో బరిలోకి దిగున్నాయి. అలానే ఈ టోర్నీలో సెంచరీలతో పాటు బౌలర్ల మ్యాజిక్, ఫీల్డర్ల విన్యాసాలు కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్ కప్ హిస్టరీలో టాప్ 5 ఫీల్డర్లు ఎవరో చూద్దాం…
1. రికీ పాంటింగ్.. వరల్డ్ కప్ హిస్టరీలో బెస్ట్ ఫీల్డర్ల గురించి ప్రస్తావన వస్తే.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరు తప్పకుండా ఉంటుంది. తమ టీమ్‌కు రెండు ప్రపంచకప్‌లు అందించిన ఘనత అతడికి సొంతం. 1996 నుంచి 2011 వరకు జరిగిన మెగా టోర్నీల్లో మొత్తం 46 మ్యాచుల్లో బరిలోకి దిగిన అతడు.. 28 క్యాచులను పట్టుకున్నాడు. దాదాపుగా ప్రతి మ్యాచులో 3 క్యాచులను ఒడిసి పట్టాడు. క్యాచెస్‌లో అతడి యావరేజ్ 0.608గా ఉంది.
2. జో రూట్.. ఈ ఇంగ్లాండ్ ప్లేయర్ ప్రపంచ కప్ టాప్ – 5 ఫీల్డర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు 2015, 2019 ప్రపంచ కప్ లలో బరిలోకి దిగిన అతడు.. మొత్తం 17 మ్యాచులలో 20 క్యాచుల వరకు అందుకున్నాడు. క్యాచెస్‌లో అతడి యావరేజ్ 1.176 గా ఉంది.
3. సనత్ జయసూర్య.. లంక జట్టు మాజీ ఓపెనర్, బ్యాటర్ సనత్ జయసూర్య.. ఒంటిచేత్తో ఆ జట్టుకు ఎన్నో సార్లు విజయాన్ని అందించాడు. ఓపెనర్‌గా భారీగా పరుగులను సాధిస్తూనే.. ప్రత్యర్థి జట్లపై ఒత్తిడి పెంచే సామర్థ్యం అతడిది. 1992 నుంచి 2007 వరకు టోర్నీల్లో పాల్గొన్న అతడు.. మొత్తం 38 మ్యాచులు ఆడగా.. అందులో 18 క్యాచలను ఒడిసి పట్టాడు. ఇతడి క్యాచెస్ యావరేజీ 0.473గా ఉంది.
4. క్రిస్ గేల్.. ఈ యూనివర్సల్ బాస్ విండీస్ భీకర ప్లేయర్. బ్యాట్ పడితే సిక్సలు వర్షమే. ఫీల్డింగ్ కూడా అద్భుతంగా చేస్తాడ. కెరీర్ లో 2003 నుంచి 2019 వరకు జరిగిన మెగా టోర్నీల్లో పాల్గొన్న ఇతడు… మొత్తం 35 మ్యాచుల్లో 17 క్యాచులను పట్టాడు. ఇతడి క్యాచెస్ యావరేజ్ 0.485గా ఉంది.
5. ఫాఫ్ డుప్లెసిస్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకునే ఈ సౌతాఫ్రికా ప్లేయర్.. ముఖ్యంగా బౌండరీ లైన్ వద్ద క్యాచులు అందుకోవడంతో పాటు పరుగులు ఆపడంలోనూ మంచి సామర్థ్యం ఉన్నవాడు. 2011 నుంచి 2019 వరకు ఆడిన టోర్నీల్లో మొత్తం 23 మ్యాచులు ఆడి.. 16 క్యాచులను పట్టాడు. ఇతడి క్యాచెస్ యావరేజ్ 0.272 గా నమోదైంది.