World Cup: ఇంటర్నేషనల్ క్రికెట్లో నాటి డాన్ బ్రాడ్ మన్ నుంచి నేటి కోహ్లీ వరకు ఆయా జట్లలో ఎంతో మంది లెజెండరీ ప్లేయర్స్ ఉన్నారు. వీరంతా తమ కెరీర్లో వ్యక్తిగతంగా ఎన్నో రికార్డులు సాధించి జట్టుకు విజయాలు కూడా అందించారు. కానీ వీరిలో కొందరు ప్లేయర్స్ మాత్రం అంతటి ఉన్నత స్థాయికి ఎదిగినా.. వారికో తీరని లోటు ఉంది. అదే ప్రపంచకప్. చాలా మందికి అది అందని ద్రాక్ష గానే మిగిలిపోయింది. అలాంటి టాప్ 10 దిగ్గజ ఆటగాళ్ల గురించే ఈ కథనం..
1. గ్రాహం గూచ్.. ఇంగ్లాండ్ దిగ్గజమైన ఇతడు.. 1976లో అరంగేట్రం చేసి..కెరీర్లో 22,211 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ తరఫున 3 ప్రపంచ కప్ టోర్నీ ఫైనళ్లలో ఆడాడు కానీ కప్‌ను ముద్దాడలేకపోయాడు. 1992 వరల్డ్ కప్‌లోనూ ఆ జట్టుకు కెప్టెన్‌గానూ ఉన్నాడు. 1995 లో గుడ్ బై చెప్పాడు.
2. ఇయాన్ బోథమ్.. ఇంగ్లాండ్ మరో లెజండరీ ప్లేయర్ అయిన ఈ ఆల్ రౌండర్… రెండు ప్రపంచ కప్ ఫైనల్స్‌లో ఆడాడు. 1992 వరల్డ్ కప్ లో 10 మ్యాచుల్లో 16 వికెట్లు పడగొట్టి ఆ జట్టు ఫైనల్‌కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ టైటిల్‌ను ముద్దాడలేకపోయాడు.
3. సౌరవ్ గంగూలీ.. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 1999-2007 మధ్య 3 వరల్డ్ కప్పుల్లో పాల్గొన్నాడు. కానీ ఇతడు కూడా కప్‌ను ముద్దాడలేకపోయాడు.
4. బ్రియాన్ లారా.. ఈ వెస్టిండీస్ టీమ్ లెజండరీ తన కెరీర్లో వన్డేల్లో 10 వేల పరుగులు పూర్తి చేశాడు. వన్డేల్లో మూడు సార్లు 150కి పైగా పరుగులు చేశాడు. మొత్తంగా 299 వన్డేలు ఆడాడు. కానీ ప్రపంచ కప్‌ను సాధించలేకపోయాడు.
5. వకార్ యూనిస్.. ఈ పాక్ దిగ్గజ ప్లేయర్ సూపర్ ఫాస్ట్ బౌలర్. రివర్స్ స్వింగ్ బాగా చేయగలడు. ఎన్నో సార్లు 5 లేదా అంతకన్నా ఎక్కువ సార్లు వికెట్లు తీసిన ఘనత ఇతడిది. కానీ.. వరల్డ్ కప్ ను తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. 1992 ప్రపంచ కప్ గెలిచిన పాక్ జట్టులో అతడు లేడు. అలానే 1999 లో జరిగిన ప్రపంచకప్ టోర్నీలో ఉన్నప్పటికీ.. అప్పుడు పాక్ ఓటమిని అందుకుంది.
6. లాన్స్ క్లూసెనర్.. 1990, 2000 ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ఒకడు. ఫాస్ట్-మీడియం స్వింగ్ బౌలింగ్‌కు బాగా చేస్తాడు. 1999 ప్రపంచ కప్ టోర్నీలో దక్షిణాఫ్రికా సెమీఫైనల్ వరకు వెళ్లింది. కానీ అక్కడ ఓటమి చెందడంతో ఇతడికి కూడా కప్‌ను ముద్దాడే అవకాశం రాలేదు.
7. జాక్వెస్ కల్లిస్.. దక్షిణాఫ్రికా గొప్ప ఆల్ రౌండర్ పేరు తెచ్చుకున్న ఇతడు.. కెరీర్లో 250 వికెట్లతో పాటు 17 సెంచరీలు, 86 అర్ధ సెంచరీలు చేశాడు. అయినా ఇతడికి కూడా వరల్డ్ కప్ కలిస్ ఒక కల గానే మిగిలిపోయింది.
8. AB డివిలియర్స్.. మిస్టర్ 360 గా పేరొందిన ఇతడు.. ఎన్నో రికార్డులు నమోదు చేశాడు. వన్డేల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ(31 బంతుల్లో) ఇతడే చేశాడు. కానీ ఈ లెజెండరీ క్రికెటర్ కూడా ప్రపంచకప్‌ను అందుకోలేకపోయాడు.
9. కుమార సంగక్కర.. ఈ శ్రీలంకన్ మాజీ క్రికెటర్ కుమార సంగక్కర వికెట్ కీపింగ్‌లో అదరగొడుతూనే.. బ్యాటర్ గా ఎన్నో సెంచరీలు బాదాడు. 2015 వరల్డ్ కప్‌లో వరుసగా నాలుగు శతకాలు నమోదు చేశాడు. అంతకు ముందు 2007, 2011 వరల్డ్ కప్‌ల్లోనూ ఆడాడు. కానీ ప్రపంచకప్‌ను ముద్దాడలేదు.
10. షాహిద్ ఆఫ్రిది.. ఈ పాకిస్థాన్ ఆల్ రౌండర్ డిల్ మిడిలార్డర్ బ్యాటర్‌గా, స్పిన్నర్ గా సేవలదించాడు. 1996 లో 37 బంతుల్లోనే సెంచరీ బాదిన అతడు.. తన జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. ఇతడికి కూడా వరల్డ్ కప్ అందని ద్రాక్ష గానే మిగిలిపోయింది.