Sreeleela: ప్రస్తుతం టాలీవుడ్‌లో దూసుకుపోతున్న యంగ్ అండ్ టాలెంటెడ్ సెన్సేషనల్ బ్యూటీ హీరోయిన్ శ్రీలీల. పెళ్లి సందడి చిత్రంతో తెలుగు చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి.. రెండో చిత్రం ధమాాకాతో ఏకంగా రూ.100కోట్ల హీరోయిన్గా మారిపోయింది. ఆ తర్వాత ఏకంగా పది సినిమా ఆఫర్లను పట్టేసింది. యంగ్ హీరోస్ నుంచి బడా స్టార్స్ వరకు అందరూ ఆమెతో నటించేందుకు రెడీ అయిపోయారు. అయితే ఈ ముద్దుగుమ్మ.. ఓ వైపు నటిస్తూనే మరోవైపు మెడిసెన్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Sreeleela: మరో ఐదు రోజుల్లో ఈ భామ.. బాలయ్యతో కలిసి భగవంతి కేసరి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇంత బిజీ షెడ్యూల్లోనూ చదవడం ఎలా కుదురుతుందనే ప్రశ్నకు స్ఫూర్తినిచ్చే సమాధానం చెప్పింది. ఇన్ని సినిమాల మధ్య చదువు ఎలా కుదురుతుందనే ప్రశ్నకు తనదైన శైలిలో జవాబు ఇచ్చింది. “మనిషి ఏదైనా ఒకే పని చేస్తూ వెళ్తే ఒక దశలో విసుగు వచ్చేస్తుంది. అందుకే రకరకాల పనులు చేస్తూ ఉండాలి. నా వరకూ సినిమాలు, మెడిసిన్ వేరు వేరు. ఈ రెండు అంటే నాకు ఎంతో ఇష్టం. అదే సమయంలో దేనికవే ప్రత్యేకం. ఒక సినిమాకు డేట్స్ ఇచ్చే ముందే చదివే సమయాన్ని ఎలా బ్యాలెన్స్ చేసులోవాలో ఒక అవగాహన నాకు ఉంటుంది” అని శ్రీలీల చెప్పుకొచ్చింది.
Sreeleela: ఇంకా మాట్లాడుతూ… “నిజానికి మనం ఇప్పుడు చేస్తున్న పని తక్కువే అని చెప్పాలి. ఒకప్పుడు ఎలాంటి సౌకర్యాలు లేకుండానే ఏడాది పది సినిమాలు చేసిన యాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడన్నీ మన చేతిలో ఉన్నాయి కదా. ప్రపంచంలో ఎక్కడికైనా ఒక విషయాన్ని కమ్యునికేట్ చేయాలంటే ఒక్క ఫోన్ కాల్‌తో అయిపోతుంది. పైగా ఒక రోజు మొత్తం పని చేసినా రాత్రికి కచ్చితంగా ఇంటికి వెళ్తాం. చదువుకోవాలనే ఆసక్తి ఉండాలే కానీ ఆ సమయం సరిగ్గా సరిపోతుంది” అని శ్రీలీల పేర్కొంది.
Sreeleela: ఇకపోతే రీసెంట్గా రామ్‌పోతినేనితో కలిసి స్కందగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది శ్రీలీల. ప్రస్తుతం బాలయ్యతో కలిసి అలరించనుంది. ఆ తర్వాత పంజా వైష్ణవ్‌తో ఆదికేశవ, నితిన్‌తో ఎక్స్ట్రా ఆర్డీనరీ, వచ్చే ఏడాది గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్, విజయ్ దేవరకొండ, నీవన్ పోలిశెట్టి సినిమాలతో అలరించనుంది.