Revanth Reddy: ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఏ ప్రభుత్వంలోనూ పని చేయలేదు. ఎలాంటి కేబినెట్ హోదా పదవిని ఆయన చేపట్టలేదు. ఇన్నేళ్లలో చివరికి అధికార పార్టీ ఎమ్మెల్యేగా కూడా రేవంత్ రెడ్డి ఆయన లేరు. ఎలాంటి ప్రభుత్వ పదవులు నిర్వర్తించకుండానే జాతీయ పార్టీలో ఓకేసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన ఏకైక తెలుగు రాజకీయ నేతగా రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో ఈ ఘనత సాధించిన రెండో వ్యక్తింగా రేవంత్ ఖ్యాతిని గడించారు. ఇంతకుముందు బీజేపీ(bjp) నుంచి నరేంద్ర మోదీ (narendra modi) మాత్రమే ఎలాంటి ప్రభుత్వ పదవులు నిర్వర్తించకుండా డైరెక్ట్‌గా 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత జాతీయ పార్టీల్లో ఆ ఘనత సాధించిన వ్యక్తి రేవంత్ రెడ్డి.
Revanth Reddy: రేవంత్ రెడ్డి 2001లో కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్‌తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2006లో జెడ్పీటీసీ ఎన్నికల్లో నాటి అధికార పార్టీ అభ్యర్థిపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2007లో మహబూబ్‌నగర్ నుంచి ఎమ్మెల్సీగా స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కూడా అధికార పార్టీ అభ్యర్థిపై విజయం సాధించారు. ఈ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డికి నాటి అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ టీడీపీ నుంచి పిలుపు వచ్చింది. అయితే ఆనాడు రేవంత్ రెడ్డి అధికార పార్టీలో చేరకుండా ప్రతిపక్ష టీడీపీలో చేరారు. టీడీపీలో ఆయనకు సముచిత గౌరవం లభించింది.
Revanth Reddy: 2009లో టీడీపీ నుంచి కొడంగల్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు. ఆ తర్వాత చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఆయన మెలిగారు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ మరోసారి కొడంగల్ నుంచి ఎన్నికయ్యారు. అనంతరం రేవంత్ ట్యాలెంట్‌ను మెచ్చి తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చంద్రబాబు నియమించారు. ఆ తర్వాత రాష్ట్రంలోని రాజకీయ పరిణామాల దృష్ట్యా రేవంత్ 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం కాంగ్రెస్ నుంచి కేసీఆర్‌ను ఎదుర్కొనే ధీటైన నాయకుడిగా ఎదిగారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాడ్ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి బాధ్యతలను అప్పజెప్పింది. ఆ పదవిని సమర్థంగా నిర్వర్తించి.. పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చారు.