Mumbai man sleep: మీరు రోజుకు ఎన్ని గంటలు నిద్రపోతారు? మానవ శరీరానికి అవసరమైన 6 నుంచి 7 గంటల వరకు నిద్రపోతారు. కొంచేం సోమరితనమో, వయసు సమస్యలు, ఇతర కారణాల వల్ల మహా అంటే 9గంటల కంటే ఎక్కువ నిద్రపోము. కానీ ముంబైకి చెందిన 26 ఏళ్ల యువకుడు గత 8రోజులుగా ఏకధాటిగా నిద్రపోతున్నాడని మీకు తెలుసా? అవును నిజమే, గత ఎనిమిది రోజులుగా ఆ యువకుడు అసలు నిద్ర నుంచి బయటకు రావడం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ యువకుడు వరుసగా 8 రోజులు నిద్రపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఎనిమిది రోజుల్లో కేవలం తినడానికి, టాయిలెట్‌కు మాత్రమే లేచాడని, అప్పుడు కూడా నిద్రమత్తులోనే ఉన్నాడని వైద్యులు వెల్లడించారు.
Mumbai man sleep: ఆ యువకుడికి క్లీన్ లెవిన్ సిండ్రోమ్(Kleine-Levin Syndrome -KLS ) అనే వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని న్యూరాలజిస్ట్ డా. ప్రశాంత్ మఖీజా తెలిపారు. తన కెరీర్‌లో ఇది మూడో కేసుగా ఆయన చెప్పుకొచ్చారు. న్యూరాలజిస్టులు దశాబ్దానికి ఒక కేసును మాత్రమే ఇలాంటి కేసును చూసే అవకాశం ఉంటుంది. తాజాగా ఈ కేఎల్ఎస్ కేసు ఇటీవల ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నివేదించబడింది. 26ఏళ్ల వ్యక్తికి క్లీన్-లెవిన్ సిండ్రోమ్ (కేఎల్ఎస్) ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఎనిమిది రోజులు ఏకధాటిగా నిద్రపోవడం, అతిగా తినడం, మలం విసర్జించడం కోసం మాత్రమే మేల్కొలపడం వంటివి కేఎల్ఎస్ ఇన్ఫెక్షన్ లక్షణాలు.
Mumbai man sleep: ఈ రుగ్మతకు స్పష్టమైన కారణాలు లేవని న్యూరాలజిస్ట్ డా. ప్రశాంత్ మఖీజా వెల్లడించారు. ఈ వ్యాధిని విస్తృతమైన వైద్య పరీక్షల తర్వాతే నిర్దారించడం సాధ్యమవుతుందని చెప్పారు. ఈ రుగ్మత ప్రధానంగా కౌమారదశలో, యువకుల్లో ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుదన్నారు. సాధారణంగా 12 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఈ వ్యాధి బారిన పడొచ్చని, అలాగే వృద్ధులు కూడా బాధితులు ఉండొచ్చని వెల్లడించారు. పదేళ్ల క్రితం 40 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తికి KLS ఉన్నట్లు నిర్ధారణ జరిగిందని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నడుపుతున్న బీవైఎల్ నాయర్ ఆసుపత్రిలో న్యూరాలజిస్ట్ డాక్టర్ రాహుల్ చకోర్ చెప్పారు. దీనికి వ్యాధికి అప్పట్లో ‘కుంభకర్ణ సిండ్రోమ్’ అని పెరుపెట్టినట్లు గుర్తు చేసారు.
Mumbai man sleep: కేఎల్ఎస్ వ్యాధితో బాధపడుతున్న వారు కనీసం సంవత్సరానికి ఒకసారి ఆ రుగ్మతకు సంబంధించిన లక్షణాలతో ఇబ్బంది పడతారని డాక్టర్ మఖిజా పేర్కొన్నారు. ఈ రగ్మతకు ఎటియాలజీ అనేది కనుక్కోలేదని, కాబట్టి దీనికి దీనికి నివారణ అసాధ్యం అన్నారు. ఎటియాలజీ అనేది వ్యాధులు లేదా రుగ్మతల కారణాలు లేదా మూలాలను సూచిస్తుంది. అయితే ఈ వ్యాధి వచ్చిన వారు ఎవరూ పూర్తిస్థాయిలో చికిత్స తీసుకోలేదని, దీనిపై అధ్యయనం చేద్దామనుకునే లోపే వారు తమ దగ్గర చికిత్స తీసుకోవడం మానేసారని బీవైఎల్ నాయర్ ఆసుపత్రిలో ప్రొఫెసర్ డాక్టర్ నీనా ఎస్ సావంత్ అన్నారు.