Most successful actress: సినిమాల్లో కథనాయకులు ఎంత ముఖ్యమో కథానాయికలు కూడా అంతే ముఖ్యం. వారు తమ గ్లామర్‌తో పాటు యాక్టింగ్ స్కిల్స్‌తో కథ మొత్తాన్ని నడిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. చాలా సార్లు హీరోల కన్నా వీరిని చూసేందుకే అభిమానులు వస్తుంటారు కూడా. అయితే ఎంత క్రేజ్, పాపులారిటీ ఉన్న.. హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు తక్కువ రెమ్యునరేషన్ ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే ఓ హీరోయిన్ మాత్రం అలా కాదు. తన కెరీర్లోనే ఓ సరికొత్త రికార్డును సృష్టించి ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్గా ఇంకా కొనసాగుతోంది. బాక్సాఫీస్ వసూళ్లలో క్వీన్‌గా నిలిచిందనే చెప్పాలి. ఆమె మెరెవరో కాదు.. అభిమానులు బెబో అంటూ ముద్దుగా పిలుచుకునే బాలీవుడ్ ముద్దుగుమ్మ కరీనా కపూర్.
Most successful actress: దాదాపు రెండు దశాబ్దాలుగా పరిశ్రమలో కొనసాగుతున్న ఈ భామ.. తన సినిమాలతో బాక్సాఫీస్ వద్ద కాసుల పంట కురిపిస్తోంది. ఇప్పటి తరం కథానాయికల్లో దాదాపు 23 బ్లాక్ బస్టర్లను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఆమె సోదరి కరిష్మా కపూర్ ఉండగా.. అనంతరం కత్రినా కైఫ్‌లు(22), రాణి ముఖర్జీ(21), ప్రియాంక చోప్రా(18), కాజోల్(14) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
Most successful actress: ఇంకా కరీనా కపూర్ ఖాతాలో రెండు ఆల్‌టైమ్ బ్లాక్ బస్టర్లు కూడా ఉన్నాయి. ‘బజరంగీ భాయిజాన్’, ‘3 ఇడియట్స్’. వీటితో పాటే ‘ఐత్రాజ్’, ‘కబీ ఖుషీ కబీ గమ్’, ‘బాడీ గార్డ్’, ‘జబ్ వి మెట్’, ‘గుడ్ న్యూస్’ చిత్రాలూ కూడా ఉన్నాయి. ఈ చిత్రాలన్నీ కలిపి బాక్సాఫీసు వద్ద సుమారు రూ. 4 వేల కోట్ల గ్రాస్ కలెక్షన్లను అందుకున్నాయట. వీటిలో ‘బజరంగీ భాయిజాన్’ ఒక్కటే ప్రపంచ వ్యాప్తంగా రూ. 918 కోట్ల వరకు అందుకోవడం విశేషం.
Most successful actress: కరీనా తర్వాత రూ. 3 వేల కోట్ల క్లబ్లో దీపికా పదుకొణే, అనుష్క శర్మ ఉండగా.. సౌత్ హీరోయిన్లలో అనుష్క శెట్టి, తమన్నా భాటియా ‘బాహుబలి’తో ఈ లిస్ట్‌లో నిలిచారు. బాహుబలి ఒక్కటే రూ. 2400 కోట్లు సాధించడంతో ఈ ఘనత అందుకున్నారు. ఇక రూ. 2 వేల కోట్ల క్లబ్లో ఐశ్వర్యా రాయ్, ఆలియా భట్, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, నయనతార ఉన్నారు. రూ. 2024 కోట్ల వరకు అందుకున్న ‘దంగల్’ స్టార్స్ ఫాతిమా సన షేక్, సన్యా మల్హోత్రా కూడా ఈ క్లబ్లో నిలిచారు.