Children hungry: పిల్లలకు ఆకలేస్తుంటే వాళ్లు మంచి ఆరోగ్యంగా ఉన్నట్టని వైద్యులు చెబుతుంటారు. అదే ఆకలి లేదు, ఏదీ తినాలనిపించడం లేదని అంటే మాత్రం అనుమానించాల్సిందే. అయితే కొంతమంది చిన్నారులను గమనిస్తే.. చిరుతిండికి అలవాటు పడి అన్నం తినరు. లేదంటే ఫోన్ చేతికిస్తే కానీ అన్నం ముట్టుకోరు. ఇంకా చాలా కారణాలే ఉన్నాయి. కాబట్టి పిల్లలకు ఆకలి పెరగాలంటే ఏం చేయాలో చూద్దాం…
మొదట సమయానుకూలంగా పిల్లలకు భోజనం పెట్టడానికి ప్రత్యేక దృష్టి సారించాలి. కొట్టడం, తిట్టడం వంటి చేసి కాకుండా భోజనం
సమయానుకూలంగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వారికి వివరించాలి. మంచి పౌష్టికాహారం వండి పెట్టాలి.
జంక్ ఫుడ్ అలవాటు వల్ల ఊబకాయం, అనారోగ్య కారకాలు దరి చేరే అవకాశం ఉంటుంది. వాటికి దూరంగా ఉంచేందుకు ప్రయత్నించాలి.
పిల్లలకు పాలు ఎక్కువగా తాగించాలి. అయితే అది ఆరు నెలల వరకు చాలు. అనంతరం ఆహారం అలవాటు చేయాలి. ఎక్కువకాలం తల్లిపాలు ఇస్తే ఆహారం మీద అంతగా ఆసక్తి ఉండదు. ఇంటిల్లిపాది ఒకేసారి తినడం వల్ల కూడా పిల్లలకు ఆహారం తినడం బాగా అలవాటు అవుతుంది.
మరీ ముఖ్యంగా పిల్లలు స్కూల్ నుంచి రాగానే.. 4 లేదా 5 గంటలకు.. వండినవి, కారం, ఉప్పు, నూనెలో వేసినవి, ఉడికించిన చిరు తిండి పెట్టకూడదు. దీంతో అతడి ఆకలి, ఆరోగ్యం నాశనం చేసినట్టే. కడుపు ఫుల్ అయిపోతుంది. వారికి రాత్రికి భోజనం చేయాలనిపించదు. నష్టం జరుగుతుంది.
స్కూల్ నుంచి రాగానే ఓ గ్లాస్ పండ్ల రసం ఇవ్వండి. పండ్ల రసం అంటే యాపిల్, బనానా షేక్‌లు కాదు.. పాలు, పంచదార, ఐస్ లేకుండా ఇవ్వాలి. బత్తాయి, కమల, పైన్ యాపిల్ జ్యూస్ ఇవ్వడం మంచిది. ఇవి చాలా ఆరోగ్యం. పుచ్చకాయ వల్ల అంతగా ఉపయోగం ఉండదు. దానిమ్మ కూడా ఎక్కువ పురగుల మందు కొడతారు. అయినా తాగాలని పిస్తే ఎప్పుడో ఓ సారి తాగొచ్చు.
కాయలను ఫ్రిజ్‌లో పెడితే.. జ్యూస్ చేసే గంటన్నార ముందే బయటకు తీసేయండి. ఎందుకంటే చల్లటి జ్యూస్‌లు మంచివి కావు. చల్లదనం వల్ల అందులో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అలాగే గొంతు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. టాన్సిల్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పంచదార బదులు తేనె వాడటం మంచిది. లేదంటే ఎండు ఖర్జూరం మెత్తడి పొడి వేసుకోండి. మంచి ఐరన్, శక్తిని ఇస్తుంది. ఆరోగ్యం వస్తుంది.
చెరుకు రసం మంచిది. కొబ్బరి బొండం నీళ్లు. లేదంటే నీళ్లలో తేనే కలిపి తాగించండి. ఆ తర్వాత తప్పకుండా వారిని ఆటలకు పంపండి. సెల్ఫోన్లు, టీవీలు వద్దు. అప్పుడే కండరాళ్లు ఫ్రీ అవుతాయి. బాగా ఆడి ఆడి.. ఈ జ్యూస్‌లు తాగడం వల్ల ఆకలి బాగా పెరుగుతుంది. తొందరగా డిన్నర్ 7 గంటల లోపే పెట్టండి. దీంతో పిల్లలు మంచి ఆరోగ్యంగా ఉంటారు.