Best Dancers In Indian Cinema: ఇండియన్ సినిమాలో బెస్ట్ డ్యాన్స్ హీరోస్​ ఎవరో చెప్పగలరా?

Best Dancers In Indian Cinema: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలకు కొదవే లేదు. వారిలో చాలా మంది అదిరిపోయే సూపర్ డ్యాన్స్​ పెర్​ఫార్మెన్స్​తో అభిమానులను ఆకట్టుకున్నారు. కోట్లాది మంది ఫ్యాన్స్​ను సంపాదించుకుని చిత్ర సీమలో తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. మరి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ డ్యాన్సర్లుగా రాణిస్తున్న స్టార్ హీరోలు ఎవరో చూద్దాం…

1. ఇండియన్ మైకెల్ జాక్సన్​గా పేరు పొందిన ప్రభుదేవా ఎప్పుడు టాప్ లిస్ట్ డ్యాన్సర్​లో ముందుంటాడు. 1990లో కొరియోగ్రాఫర్​గా కెరీర్ ప్రారంభించిన అతడు.. ఎన్నో ఐకానిక్ స్టెప్​లను, ఫాస్​ పేస్​డ్​ ఫుట్​ వర్క్​, డైనమిక్ ఎక్స్​ప్రెషన్స్​కు క్రియేట్ చేశారు. చల్ మార్​, ముక్కాబలా, ఊర్వశి ఊర్వశి, గో గో గోవిందా, గులెబా వంటి ఎన్నో హిట్ సాంగ్స్ ఆయన కెరీర్​లో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సిల్వర్​స్క్రీన్​పై నటనతోనూ ఆయన ఆకట్టుకున్నారు. 1994లో ఇందు అనే తమిళ చిత్రంతో తెరపై కనిపించారు. ఆ తర్వాత తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం ఎన్నో హట్ చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు.

2. గ్రీక్ దేవుడుగా ఇండియన్ ఫ్యాషన్ ఐకాన్​ గుర్తింపు పొందిన​ హృతిక్ రోషన్​.. బాలీవుడ్​లో ఫైనెస్ట్​ డ్యాన్సర్​గా గుర్తింపు పొందారు. ఎన్నో కాంప్లెక్స్​ డ్యాన్స్ స్టెప్పులను అవలీలగా వేస్తూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. క్లాసికల్​, కాంటెంపరరీ, హిప్ హాప్​, ఫ్రీ స్టైల్​ ఏదైనా సరే ఈజీగా వేయగలరు. ధూమ్​, ఎక్​ పల్కకా జీనా, గుంగ్రూ వంటి ఎన్నో హిట్ పాటలు, డ్యాన్స్​ స్టెప్పులు ఆయన కెరీర్​లో ఉన్నాయి.

3.1976లో జన్మించిన రాఘవ లారెన్స్​.. కొరియోగ్రాఫర్​గా కెరీర్ ప్రారంభించి నటుడిగా, దర్శకుడిగా రాణిస్తున్నారు. సౌత్ సినిమాలో ప్రభుదేవ తర్వాత ఆయనే ఎంతో క్రేజ్ సంపాదించారు. తమిళ, తెలుగు, హిందీలో ఎన్నో ఐకానిక్​ సాంగ్స్​కు కొరియోగ్రఫీ చేశారు. 2000లో పార్థన్​ రసిథెన్ చిత్రంతో నటన ప్రారంభించారు. ముని సిరీస్​కు బాగా పాపులర్ అయ్యారు. స్టైల్​, నలుపు, కాదల్ ఓరు విజిల్, రా రా రమ్మంటున్న పాటలకు ఆయన కెరీర్​లో ప్రత్యేకంగా నిలిచాయి.

4.తెలుగు హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్​ డ్యాన్స్​లు బాగా చేస్తారని మంచి పేరుంది. ఆయన ఎనర్జిటిక్ డ్యాన్స్, గ్రేస్​కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సింగిల్ టేక్ యాక్టర్​. ఎన్నో తెలుగు పాపులర్ సాంగ్స్​కు ఆయన డ్యాన్స్ స్టెప్పులు తోడై సూపర్ హిట్​గా నిలిచాయి. టైంపర్ టైటిల్ సాంగ్​, రెడ్డి ఇక్కడ చూడు, యాపిల్ బ్యూటీ, యంగ్ యమా, నాటు నాటు వంటి సాంగ్స్​లో ఆయన డ్యాన్స్​ అద్భుతమనే చెప్పాలి.

5. తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డ్యాన్స్​కు ఎంతో ఫేమస్​. తన ఎలక్ట్రిఫైయింగ్ డ్యాన్స్​కు, మెస్మరైజింగ్ ఎక్స్​ప్రెషన్స్​కు ఎంతో పేరు సంపాదించుకున్నారు. ఆయన కళ్లు, ఫేసియన్ ఎక్స్​ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్​ అభిమానులను బాగా ఆకట్టుకుంటాయి. ఊ అంటావా, రింగ రింగ, బుట్ట బొమ్మా, సినిమా చూపిస్తా మావ వంటి సాంగ్స్​కు ఆయన వేసిన స్టెప్పులు ప్రత్యేకంగా నిలిచాయి.

6. బాలీవుడ్​లో హృతిక్ రోషన్ తర్వాత ఆ రేంజ్ డ్యాన్స్​లో క్రేజ్ సంపాదించుకున్న హీరో టైగర్ ష్రాఫ్. ఆయన ఫిట్​నెస్​కు, కళ్లు చెదిరే స్టంట్స్​కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆయన హైఎనర్జీ స్టెప్పులు, ఫ్లిప్స్​, యాక్రోబెటిక్స్​ అద్భుతం. ఆయన డ్యాన్స్​ స్టెప్పులకు మార్షల్ ఆర్ట్స్ తోడై అద్భుతాన్ని చేశాయి. వందే మాతరం, కాసనోవా, డింగ్ డింగ్​, ముండియన్, విజిల్ బాజా సాంగ్స్​ స్టెప్పులు ఆయన కెరీర్​లో హైలైట్​గా నిలిచాయి.

7. ఎన్టీఆర్, అల్లు అర్జున్ తర్వాత చెప్పుకునే పేరు రామ్ చరణ్. నాటు నాటు, జిగేలు రాణి, కుంఫు కుమారి, ఎక్ బార్.. చరణ్​ను ప్రత్యేకంగా నిలిపాయి.

8. బాలీవుడ్​లో మరో చెప్పుకునే పేరు షాహిద్ కపూర్. బాలీవుడ్ డ్యాన్సింగ్ సెన్సేషన్​గా నిలిచారు. మ్యూజిల్ రిథమ్​కు తగ్గట్టుగా ఆడియెన్స్​ను మెస్మరైజ్ చేయగలరు. హై ఆక్టేన్​ డ్యాన్స్​ అయినా లేదా సోల్​ఫుల్ రొమాంటిక్ సాంగ్స్​ అయినా అవలీలగా స్టెప్పులు వేయగలరు. ఎక్ దిల్​ ఎక్​ జాన్, బేఖావలి, ఘూమర్​, షార్ షాందర్ ఆయన కెరీర్​లో హైలైట్​గా నిలిచాయి.

9.రామ్ చరణ్ తర్వాత ఇక బాగా వినిపించే పేరు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. తన డైనమిక్ యాక్టింగ్ స్కిల్స్​తో పాటు అద్భుతంగా డ్యాన్స్ చేయగలరు. ఆయన ఎనర్జిటిక్ ఎక్స్​ప్రెషన్స్​, ఎంగేజింగ్ పెర్​ఫార్మెన్స్​ ఓ ఎలక్ర్టిక్​ అట్​మాస్​ఫియర్​ను క్రియేట్ చేస్తాయి. దిమాఖ్ కరాభ్​, విజిల్​ విజిల్, డించక్​, ఇస్మార్ట్ టైటిల్ సాంగ్స్​.. ఆయన కెరీర్​లో ప్రత్యేకంగా నిలిచాయి.

Check Also

Vjayakanth death: సినీ పరిశ్రమలో విజయకాంత్ సాధించిన రికార్డులు, రివార్డులు ఇవే

Vjayakanth death: సినీ పరిశ్రమలో విజయకాంత్ సాధించిన రికార్డులు, రివార్డులు ఇవే

Vjayakanth death: కరుప్పు ఎంజీఆర్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే విజయకాంత్ గురువారం కన్నుమూశారు. తమ ఫేవరెట్ నటుడు మృతితో కోట్లాది …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *