Ayodhya Ram Temple: రామాలయ ప్రతిష్ఠాపనకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ క్రమంలో అయోధ్యలోని ఆలయం లోపలికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జనవరి 22న అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరామ విగ్రహానికి ‘ప్రాణప్రతిష్ఠ’ జరుగుతుంది. ఈ మహా కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. అలాగే ప్రతిపక్షాల అగ్రనేతలను కూడా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించింది.
Ayodhya Ram Temple: శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, మల్లికార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి, జేడీ(ఎస్) అధినేత దేవేగౌడలకు ఆహ్వానాలు పంపినట్లు విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ తెలిపారు.
Ayodhya Ram Temple: ఇప్పటికే ఆలయ ప్రారంభోత్సావానికి సంబంధించిన సన్నాహాలు జోరందుకున్నాయి, జనవరి 15 నాటికి అన్ని పనులను ముగించాలని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ భావిస్తోంది. ప్రాణ ప్రతిష్ట పూజ జనవరి 16న ప్రారంభమై జనవరి 22న ముగుస్తుంది. రామ మందిర ప్రతిష్ఠాపన వేడుక కోసం వారం రోజుల పాటు ఉంటుంది. ఈ నేపథ్యంలో వేడుకల ప్రారంభానికి గుర్తుగా జనవరి 17న అయోధ్యలో 100 దేవతా విగ్రహాలతో శ్రీరాముడి జీవితానికి సంబంధించిన దృశ్యాలను ప్రదర్శించనున్నారు.
Ayodhya Ram Temple: రామ మందిర సముదాయం ఎక్కువ భాగం వందలాది చెట్లతో పచ్చని ప్రాంతంగా ఉంటుంది. కాంప్లెక్స్ ను ప్రత్యేకంగా, ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా నిర్మించారు. 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కాంప్లెక్స్‌లో 70 శాతం పచ్చని ప్రాంతంగా ఉంటుందని రామమందిరం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న 600 చెట్లను గ్రీన్ బెల్ట్‌లో భద్రపరిచారు. ఆలయ సముదాయంలో రెండు ఎస్‌టీపీలు (మురుగునీటి శుద్ధి కర్మాగారాలు, ఒక WTP (నీటి శుద్ధి కర్మాగారం), పవర్ హౌస్ నుంచి ఒక ప్రత్యేక విద్యుత్ లైన్ ఉంటుంది.
Ayodhya Ram Temple: ఆలయంలోకి తూర్పు వైపు నుంచి ప్రవేశం ఉంటుందని, దక్షిణం వైపు నుంచి నిష్క్రమణ ఉంటుదని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. మొత్తం ఆలయ నిర్మాణం మూడు అంతస్తులుగా ఉంటుందని, సందర్శకులు తూర్పు వైపు నుండి 32 మెట్లు ఎక్కి ప్రధాన ఆలయానికి చేరుకుంటారని వివరించారు. సాంప్రదాయ నాగర శైలిలో నిర్మించిన ఆలయ సముదాయం 380 అడుగుల పొడవు (తూర్పు-పడమర దిశ), 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తు ఉంటుందని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వివరించారు.
ఇదీ చదవండి:
Aadhaar Security Verification: కొత్తగా ఆధార్ పొందాలనుకునే వారు ఈ నిబంధన గురించి తెలుసుకోండి