Andhra pradesh: ఏర్పేడు మండల రచపాలెం గ్రామంలో వంశీ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం సందర్బంగా శుక్రవారం నోటు బుక్స్ పంపిణీ చేసారు.
వంశీ సేవ ట్రస్ట్ కో -ఆర్డినేటర్ వంశీ మాట్లాడుతూ.. పేదవాళ్ళకి విద్యార్థులకు అన్నివిధాలా సహాయం చేయడమే లక్ష్యం గా తాము నలుగురు స్నేహితులం కలిసి ఏర్పాటు చేసిందే ఈ వంశీ సేవ ట్రస్ట్ అన్నారు.
ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం ఆకలితో ఉన్నావరికి అన్నదానం చేయడంతో పాటు, కష్టం లో ఉన్న వారికీ ఆర్థిక సహాయం చేయడమే లక్ష్యం అన్నారు.