Telangana Cabinet: తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం.. శాఖల కేటాయింపు ఇదే..

Telangana Cabinet: తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం.. శాఖల కేటాయింపు ఇదే..
Telangana Cabinet: తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం.. శాఖల కేటాయింపు ఇదే..

Telangana Cabinet: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గురువారం కొలువుదీరింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. రేవంత్ రెడ్డి, భట్టితో పాటు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర్ రావు, కొండా సురేఖ, జూపల్లి, కృష్ణ పొంగులేటి మంత్రులుగా ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరి ఏ శాఖను కేటాయించారో తెలుసుకుందాం.

భట్టి విక్రమార్క – డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ
భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎంతో పాటు రెవెన్యూ శాఖను రేవంత్ రెడ్డి కేటాయించారు. గత తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్‌పీ) నాయకుడిగా భట్టి పని చేశారు. భట్టి విక్రమార్క చేసిన పాదయాత్ర కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి దోహదపడింది. భట్టి వరుసగా నాలుగోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2009, 2014, 2018, 2023 ఎన్నికల్లో వరుసగా భట్టి గెలుపొందారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి – హోంశాఖ
ఉత్తమ్ కుమార్ రెడ్డికి కీలకమైన హోంశాఖను కేటాయించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999, 2004, 2009, 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. 2015 నుంచి 2021 వరకు టీపీసీసీ చీఫ్‌గా పని చేశారు. గతంలో ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్‌లో గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి – మున్సిపాల్ శాఖ
మరో కీలక నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మున్సిపాల్ శాఖను కేటాయించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999, 2004, 2009, 2014, 2023 ఎన్నికల్లో విజయం సాధించారు. దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో ఐటీ మంత్రిగా పనిచేశారు.

పొన్నం ప్రభాకర్ – బీసీ సంక్షేమ శాఖ
పొన్నం ప్రభాకర్‌కు బీసీ సంక్షేమ శాఖను కేటాయించారు. పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్‌లో చాలా సీనియర్. ప్రస్తుతం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. 2009లో కరీంనగర్ నుంచి పోటీ చేసి విజయ సాధించారు. ఇప్పుడు తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు.

సీతక్క-గిరిజన సంక్షేమ శాఖ
రేవంత్ రెడ్డి సోదరిగా భావించే సీతక్కకు గిరిజన సంక్షేమ శాఖను కేటాయించారు. సీతక్క అసలు పేరు దనసరి అనసూయ. సీతక్క నక్సలైజ్ జీవితం నుంచి ప్రజాజీవితంలోకి అడుగుపెట్టింది. సీతక్క 2009, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు.

దామోదర్ రాజనరసింహ – వైద్యం, ఆరోగ్య శాఖ
కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర్ రాజనరసింహకు వైద్యం, ఆరోగ్య శాఖను కేటాయించారు. సి.దామోదర్ రాజనరసింహ 1989, 2004, 2009, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రి, ఉన్నత విద్య, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు.

శ్రీధర్ బాబు – ఆర్థిక శాఖ
మరో సీనియర్ నాయకుడు శ్రీధర్ బాబుకు కీలకమైన ఆర్థిక శాఖ కేటాయించారు. డి.శ్రీధర్ బాబు ఐదోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999, 2004, 2009, 2018, 2023 ఎన్నికల్లో గెలిచారు. డి.శ్రీధర్ బాబు ప్రస్తుతం ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్య, ఎన్ఆర్ఐ వ్యవహారాల మంత్రి, పౌర సరఫరాల మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది.

తుమ్మల నాగేశ్వరరావు – రోడ్లు, భవనాల శాఖ
తుమ్మల నాగేశ్వరరావు‌కు తనకు అనుభవం ఉన్న రోడ్లు, భవనాల శాఖనే రేవంత్ రెడ్డి కేటాయించారు. తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుత క్యాబినెట్‌లో అత్యంత సీనియర్ మంత్రి. తుమ్మల ఇప్పటి వరకు ఎన్‌టీ రామారావు, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ మంత్రి వర్గంలో పనిచేశారు. ఇప్పుడు రేవంత్ మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. తుమ్మల నాగేశ్వరరావు 1985, 1994, 1999, 2009, 2016, 2023 ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2015 -2016 మధ్య ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు.

పొంగులేటి శ్రీనివాస రెడ్డి – నీటిపారుదల శాఖ
ఖమ్మం జిల్లా సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డికి నీటిపారుదల శాఖను కేటాయించారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. తొలిసారే ఆయనకు మంత్రిపదవి వరించింది. 2014లో ఖమ్మం నుంచి వైసీపీ నుంచి విజయం సాధించారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

కొండా సురేఖ – మహిళా, శిశు సంక్షేమ శాఖ
ఉమ్మడి వరంగల్ సీనియర్ నేత కొండా సురేఖకు మహిళా, శిశు సంక్షేమ శాఖను కేటాయించారు. కొండా సురేఖ గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 1999, 2004, 2009, 2014, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొండా సురేఖ విజయం సాధించారు.

జూపల్లి కృష్ణరావు – పౌర సరఫరాల శాఖ
జూపల్లి కృష్ణరావుకు పౌర సరఫరాల శాఖను కేటాయించారు. జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నుంచి 1999, 2004, 2009, 2012, 2018, 2023 ఎన్నికల్లో విజయం సాధించారు. గతంలో వై‌ఎస్ రాజశేఖర్ రెడ్డి, ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.

Check Also

Andhra pradesh: రచపాలెం గ్రామంలో వంశీ సేవ ట్రస్ట్ ఆంధ్వర్యంలో బుక్స్ పంపిణీ

Andhra pradesh: రచపాలెం గ్రామంలో వంశీ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుక్స్ పంపిణీ

Andhra pradesh: ఏర్పేడు మండల రచపాలెం గ్రామంలో వంశీ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం సందర్బంగా శుక్రవారం నోటు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *