Good sleep tips in telugu: కంటినిండా నిద్రపట్టాలంటే.. ఇవి చేస్తే చాలు.. ఆ రోగాలన్నీ మాయం!

Good sleep tips in telugu: నిద్ర అనేది దేవుడు ఇచ్చిన వరం. నిద్ర పోయినప్పుడు శరీరంలో రిపెయిర్ ప్రాసెట్​ జరుగుతుంది. ఒకవేళ పడుకోకపోతే ఎన్నో అనేక రకాలు సమస్యలు వస్తాయి. రోజంతా చిరాకుగా అనిపిస్తుంది. ఏ పనినీ సంపూర్ణంగా చేయలేం. అలా చాలీ చాలని నిద్రతో జీవక్రియలూ గతి తప్పి.. మధుమేహం ముప్పు పెరిగేలా చేస్తుంది. కాబట్టి మనిషికి ఎంత నిద్ర అవసరం? ఎన్ని గంటలు నిద్రపోవాలి? అసలు నిద్ర పట్టాలంటే ఏం చేయాలి? వంటి తెలుసుకుందాం..

  • నిద్రపోయే కొద్ది సేపటి ముందే బ్లూ లైట్​ పరికరాలను దూరం చేయాలి. ముఖ్యంగా టీవీ, సెల్​ఫోన్​ లాంటివి.
  • పగటి పూట 20 నిమిషాలకు మించి నిద్రపోకూడదు. చిన్నపాటి కునుకు తీస్తే ఫ్రెష్​గా ఉంటారు.
  • దిండు బాగా ఎత్తుగా, కిందకి కాకుండా సమాంతరంగా ఉంచుకోవాలి. బెడ్​ రూమ్​లో​ ఎక్కువ వేడి, చల్లగా ఉష్ణోగ్రత లేకుండా చూసుకోవాలి.
  • చిన్నపిల్లలు 12 నుంచి 16 గంటలు, స్కూల్ విద్యార్థులకు 10 గంటలు, టీనేజర్స్​కు 9 గంటలు, మిగతా వాళ్లకు 8 గంటలు నిద్ర ఉండాలి. పక్కాగా ప్రతిఒక్కరికీ 8 గంటలు ఉండాల్సిందే. ఒక సమయానికి పడుకోవాలి, నిద్ర లేవాలి.
  •  రోజూ ధ్యానానికీ, ప్రాణాయామం, యోగాకి గంట సమయం వెచ్చించాలి. అప్పుడు మానసిక, శారీరక ఆరోగ్యాలతో నిద్రలేమి ఉండదు.
  • కాఫీ, టీలు ఎక్కువ తాగకూడదు.
  • తినగానే పడుకోవద్దు. కాసేపు నడవండి. మూడు నాలుగు గంటల ముందు వ్యాయామం చేయండి. అలాగే పడుకునే ముందు గోరువెచ్చటి నీటిలో కాస్త యూకలిప్టస్‌ ఆయిల్‌ కలిపి స్నానం చేస్తే మరింత చక్కగా నిద్ర పడుతుంది.
  • ఆల్కాహాల్​ తీసుకోకూడదు. అల్పాహారం తీసుకోవాలి. పడుకునే ముందు డిమ్ లైట్ ఉండాలి. గాఢ నిద్ర కోసం ప్రశాంతంగా ఉండాలి, పుస్తక పఠనం, కాస్త మ్యూజిక్ వినడం వంటివి చేస్తే మంచింది.
  • సాయంత్రం వేళ కాఫీ, కెఫీన్‌తో కూడిన పానీయాలు తీసుకోకూడదు. మద్యం అలవాటుంటే పరిమితం చేయాలి లేదంటే మానేయాలి. బరువు తగ్గించుకోవాలి. పొగ మానెయ్యాలి. నడక వంటి వ్యాయామాలు చేయాలి.
  • ఫైనల్​గా ఆదమరచి నిద్ర పోతే రోజంతా చేసిన శ్రమ, కలిగిన ఒత్తిడి నుంచి ఉపశమనం ఉంటుంది. లేదంటే ఆ అలసట రెట్టింపు చేస్తుంది. కాబట్టి ఇవన్నీ పాటించడం మంచిది. పాటించినా కూడా నిద్ర రాకపోతే.. డాక్టర్‌ను సంప్రదించాలి. లేదంటే మరిన్ని అనారోగ్యాలు దరి చేరుతాయి.

Check Also

sexual wellness tips: వారానికి ఎన్నిసార్లు సెక్స్ చేయాలి.. ఎక్కువ సార్లు చేస్తే ఏం అవుతుంది

Sexual wellness tips: వారానికి ఎన్నిసార్లు సెక్స్ చేయాలి.. ఎక్కువ చేస్తే ఏం అవుతుంది

sexual wellness tips: సెక్స్ అనేది శారీరక ఆనందాన్ని మాత్రమే ఇవ్వదు. మానసికంగా ఆనందాన్ని కూడా ఇస్తుంది. వైవాహిక జీవితంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *