550 Times re-release movie: ప్రస్తుతం ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ ఎక్కువైందన్న సంగతి తెలిసిందే. పాత చిత్రాలకు కొత్త టెక్నాలజీని జోడించి మళ్లీ విడుదల చేస్తున్నారు. అయితే సాధారణంగా ఒక చిత్రాన్ని ఎన్నిసార్లు రీ రిలీజ్ చేస్తారు? మహా అయితే రెండు సార్లు చేస్తారు. కానీ ఒక చిత్రాన్ని మాత్రం 550 సార్లు రీరిలీజ్ చేశారు. అవును మీరు చదివింది నిజమే. ప్రస్తుతం దాని గురించే ఈ కథనం..
550 Times re-release movie: ఇంతకీ ఆ సినిమా ఏంటంటే? కన్నడ బ్లాక్ బాస్టర్ చిత్రం ఓం. ఉపేంద్ర డైరెక్షన్లో శివ రాజ్‌కుమార్ హీరోగా వచ్చిన ఈ చిత్రం 1995 మే 19న రిలీజై కన్నడలో సంచలనం క్రియేట్ చేసింది. అప్పటి నుంచి మార్చి 12, 2015 వరకు ఏకంగా 550 సార్లు రీ రిలీజ్ చేశారట. అత్యధికంగా రీరిలీజ్ అయిన ఇండియన్ సినిమాగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.
ఓం సినిమా గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం…
550 Times re-release movie: డైరెక్టర్ ఉపేంద్ర కాలేజీ చదువుకునే రోజుల్లో… ఎవరో రాసిన ఉత్తరాన్ని తన స్నేహితుడు తీసుకురావడంతో ఆ ఉత్తరంలో రాసిన మ్యాటర్.. హాట్‌టాపిక్ అయిందట. ఆ సంఘటనను స్ఫూర్తిగా తీసుకుని ఓం కథలో ఫస్ట్ హాఫ్‌ను కాలేజీ రోజుల్లోనే ఉపేంద్ర రాసుకున్నారట.
550 Times re-release movie: అండర్‌వరల్డ్‌లో పని చేసిన చాలా మంది నేరస్థులు, నిందితులు ఈ చిత్రంలో నటించడం విశేషం. ఈ సినిమా కోసమే కొందరిని బెయిల్‌పై కూడా బయటకు తీసుకొచ్చారు. సెకండాఫ్‌లోని క్రైమ్, మాఫియా బ్యాక్‌డ్రాప్‌ను రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా కథను రాసుకున్నారట. కానీ అప్పటికే రిలీజైన రాంగోపాల్‌వర్మ-నాగార్జున శివ సినిమా కథకు దగ్గర పోలికలు ఉండటం వల్ల.. కొన్ని మార్పుల చేసి ప్రస్తుత కథను రాసుకున్నారట.
550 Times re-release movie: సినిమా రిలీజ్‌కు ముందే కర్ణాటకలోనే కాదు, దేశవ్యాప్తంగా ఈ సినిమాపై చాలా మందిలో ఆసక్తి ఏర్పడింది. ది వీక్ మ్యాగజైన్ ఓంపై ఏకంగా కవర్ స్టోరీనే ప్రచురించింది. లెజెండరీ యాక్టర్ రాజ్‌కుమార్ బ్యానర్‌పై ఇలాంటి సినిమాను చేయకుండా ఉండాల్సిందని అందులో రాసుకొచ్చింది.
550 Times re-release movie: ఓం సినిమా బడ్జెట్ దాదాపు రూ.70లక్షలు కాగా, మాజీ సీఎంక కుమారస్వామి దీనికి డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించడం విశేషం. మొదట ఓం చిత్రం క్లైమాక్స్ వెర్షన్‌కు సెన్సార్ అడ్డంకులు వచ్చాయి. ఆ తర్వాత మార్పులు చేయడంతో క్లియరెన్స్ లెటర్ వచ్చింది. తెలుగులో ఓంకారమ్ పేరుతో రాజశేఖర్, అర్జున్‌పండిట్ పేరుతో హిందీలో సన్నీ దేఓల్ రీమేక్ చేశారు.
550 Times re-release movie: 1996 కర్ణాటక స్టేట్ అవార్డ్స్‌లో బెస్ట్ యాక్టర్‌గా శివరాజ్‌కుమార్, నటిగా ప్రేమ, బెస్ట్ స్క్రీన్‌ప్లే రచయితగా ఉపేంద్ర, సినిమాటోగ్రాఫర్‌గా బీసీ గౌరీ శంకర్లకు అవార్డులు కూడా వచ్చాయి. బెస్ట్ యాక్టర్‌గా సౌత్ ఫిల్మ్‌ఫేర్‌ను శివ రాజ్‌కుమార్ దక్కించుకున్నారు.